ప్రతిభ

Home » ప్రతిభ

స్త్రీ హృదయం

స్త్రీ హృదయం

నా శరీరంపై హక్కు ఎవరిది?
నా శరీరంపై హక్కు ఎవరిది?
కడుపున స్త్రీ శిశు పిండంగా నేను పడినప్పుడు నన్ను చిదిమి వేయం టాడు
నాన్న..
నా శరీరం పై హక్కు ఎవరిది?
పుట్టిన పది నిమిషాల్లో చెత్త బుట్టలో చెత్త నై
వడ్ల గింజ వశమై గాల్లో కలిసి పోతాను..
నా శరీరం పై హక్కు ఎవరిది?
జన్మించిన చోట నాలో ఆడతనాన్ని చూసిన కామందులు నన్ను కడతేరుస్తున్నారు…
నేను రోజుల బిడ్డ అప్పటినుండే రోజు నన్ను నేను రక్షించుకొనుటకు సాధన చేస్తూనే ఉంటాను..
నా శరీరం పైహక్కు ఎవరిది?
నేను పెరుగుతున్న ప్రతి చోట నా శరీరాన్ని గుచ్చే చూపుల బాణాలు నొప్పి అనుక్షణం వేధిస్తుంది…
ఆడే మాట, పాడే పాట, వ్రాసే రాత, చెప్పే కవిత, చూపే చోట నా శరీర ప్రతి అవయవాన్ని వర్ణిస్తూ వారు పొందే ఆనందానికి అవుతాను నేను ఒక వస్తువు…
నా శరీరం పై హక్కు ఎవరిది?
నేను చేసే సేవలు కావాలి..
నన్ను మాత్రం మనిషి గా గుర్తించరు..
గృహాలు హింసలకు ఆలయాలుగా,..
భర్తలు బాధించే పాత్ర పోషిస్తుంటే..
బాధలు భరింపరానివిగా మారితే..
దెబ్బల తాకిడికి శరీరం మొద్దుబారితే..
నా శరీరంపై నాకు హక్కు లేదు…
ఈ సమాజం అంతటికీ నా శరీరంపై హక్కు ఉందని తెలిసింది..
నేను కొనుక్కున్న వాడు.. నన్ను కొనుక్కున్న వాడు.. నన్ను హింసిస్తుంటే అనిపిస్తుంది ఇది నా శరీరం, నేను రక్షించుకోలేనా?? తిరగబడ్డ లేనా?? ఎదిరించ లేనా?? భద్రత లో బ్రతకలేనా అని??
ప్రయత్నిద్దామా?? మన శరీరం మనదే అని నిరూపిద్దామా??
అంగడి సరుకు.. ఆట వస్తువు కాదని చూపిద్దామా…..

జీ ప్రియాంక