సామాజిక మాధ్యమాలు పైన నియంత్రణ అవసరమా?

సామాజిక మాధ్యమాలు పైన నియంత్రణ అవసరమా

ఇటీవల కాలంలో సైబర్ నేరాలు అంతులేకుండా పెరుగుతున్నాయి. వీటిలో ముఖ్యంగా బాలికలు మరియు మహిళలు బాధితులుగా ఉండటం గమనార్హం. కొద్దిమంది ఘరానా మోసగాళ్లు యుక్తవయసులో ఉన్న బాలికల కేంద్రీకరించి, కేసులు పెట్టి ట్రాప్ చేసి వారిని లైంగికంగా దోపిడీకి గురి చేయటం వాటిని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించి బంగారు నగలను డబ్బును గుంజటం దానికి ఆస్కారం లేని ఎడల ఆమె యొక్క స్నేహితులను పరిచయం చేయాలని బలవంతం చేయటం, వారి యొక్క అశ్లీల చిత్రాలను చిత్రీకరించి పంపాలని డిమాండ్ చేయడం తీరా చెప్పినవన్నీ చేశాక మరల వాటిని చూపిస్తూ బ్లాక్మెయిల్ చేయడం పరిపాటిగా మారింది.

ఇలాంటి వాటికి భయపడి లొంగిపోయిన ఎంతోమంది అమాయక బాలికలు వారి యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తోటి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. ఈ రకంగా ఈ మధ్యకాలంలో ఒక అబ్బాయి రెండు వేల మంది యుక్త వయస్సు గల బాలికలను మోసగించాడు అంటే ముక్కున వేలు వేసుకోవాల్సిందే. ఇటీవల కాలంలో విశాఖ పట్టణ నగర నడిబొడ్డున ఒక నకిలీ వైద్యుడు ఈ విధంగానే మోసగించాడు.

బీచ్ రోడ్డున వాకింగ్ చేస్తున్న మహిళలను నాజూకుగా మారుస్తానని నమ్మబలికి 30 మంది మహిళలను వంచించి యొక్క నగలను కాజేసి నాడు. వారిని నగర శివార్లకు తీసుకువెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకొని ఆ సన్నివేశాలను కెమెరాలో బంధించి నేను చెప్పినది చేయకపోతే ఆ సన్నివేశాలను ఫేస్ బుక్ లో పెడతానని బెదిరించి తనకు కావలసిన పనులన్నీ చేయించుకున్నాడు.ఇవి ఉదాహర మాత్రమే .

ఇటువంటి సంఘటనలు క్షణక్షణం జరుగుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాతీయ నేర పరిశోధన నివేదికల ప్రకారం సైబర్ నేరాలు 56 శాతం పెరిగాయి. ఇటువంటి నేరాలను అంతం చేయాలంటే చలనచిత్రాలను సెన్సార్ చేసినట్లే సామాజిక మాధ్యమాలను కూడా సెన్సార్ చేయాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాల్లో అశ్లీల చిత్రాలు, దృశ్యాలు అప్లోడ్ కాకుండా పోలీసులు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దీన్ని ప్రభుత్వాలు యుద్ధప్రాతిపదికన చేపట్టకపోతే బాలికలను మరియు మహిళలను రక్షించుకో లేము.

అసత్య వార్తలు సామాజిక మాధ్యమాల్లో సంచరించడం వలన ప్రశాంత ప్రజా జీవనానికి ముప్పు వాటిల్లుతుంది. వీటిని నియంత్రణ చేయటం లో ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉందో వాటిని పరిమితంగా వాడేసిన సామాజిక బాధ్యత కూడా మనపై అంతే ఉంది. దీనిని విస్మరిస్తే అది మన జీవనానికి గొడ్డలిపెట్టుగా మారుతుంది.

జి ప్రియాంక

4 thoughts on “సామాజిక మాధ్యమాలు పైన నియంత్రణ అవసరమా?

  1. మీ ఎలాంటి వారు ఇప్పుడు ఉన్నవారికి అవగాహన అవసరం ….

  2. ప్రియాంక గారు మీ విశ్లేషణ అద్భుతంగా ఉంటుంది. రచనా శైలి అమోఘం. అనేక పేపర్లో మీ విశ్లేషణలు చూశాం. మరింతమందికి అయ్యేలా సోషల్ మీడియాలో మీరు వ్యాసాలు రాయటం బావుంది. Keep it up priyanka madam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

//ofgogoatan.com/afu.php?zoneid=2855024