TDP Senior Leaders Joined In The YSRCP In The Presence of Vamishkrishna

 

TDP Senior Leaders Joined In The YSRCP In The Presence of Vamishkrishnaఈరోజు చినవాల్తేర్ పీతల వీధికి చెందిన పలువురు సీనియర్ నాయకులు వైసీపీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

పార్టీ కండువా వేసి సాదర స్వాగతం పలికారు.

30 సంవత్సరాలు గా టీడీపీ లో ఉన్నప్పటికీ ఒక సంవత్సరం లో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పధకాల పట్ల ఆకర్షితులై పార్టీలో చేరామని అన్నారు.

కార్యక్రమంలో వంశీకృష్ణ గారు మాట్లాడుతూ పార్టీ ని బలోపేతం చేయుటకు తమ వంతు కృషి చేయాలని, ప్రతి ఒక్కరికి పార్టీ లో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని హామీ ఇచ్చారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి రాష్ట్రాన్ని ప్రగతి పధంలో నడిపిస్తున్నారని అన్నారు.

కార్యక్రమంలో వార్డ్ మాజీ టీడీపీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ గుంటూబోయిన సాయి కుమార్ గారు, సూర్యనారాయణ గారు, అప్పలరెడ్డి గారు, నాయుడుగారు పార్టీ లో చేరగా కార్యక్రమంలో యూనివర్సిటీ యూనియన్ అధ్యక్షుడు రవికుమార్ గారు, వార్డ్ అధ్యక్షుడు మదుపాడ రవికుమార్ గారు, పీతల సాయి గారు, అశోక్ గారు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *